Posts

Showing posts with the label Movies

Joker (2019) Movie Review

Image
ది డార్క్ నైట్ సినిమాతో అత్యంత ప్రజాదరణ పొందిన జోకర్ పాత్ర అసలు పుట్టింది 1940 లలోనే. డీసీ కామిక్స్ వారి బ్యాట్ మాన్ సిరీస్ లో జోకర్ మొదటిసారిగా కనిపిస్తాడు. తర్వాత ఎన్నెన్నో కామిక్, టీవీ సిరీస్ లలోనూ, సినిమాలలోనూ కనిపించిన ఈ జోకర్ పాత్ర, ఇప్పుడు తనదంటూ ఒక కథ చెబుతానని ఇలా 'జోకర్' సినిమాగా మన ముందుకొచ్చింది. నిజానికి ఈ సినిమాలోని జోకర్ పాత్ర మూలాలేవీ అంతకు ముందు వచ్చిన సిరీస్లలోని, సినిమాలలోని జోకర్లతో పెద్దగా కనెక్ట్ కావు. దీనికై ఇది ఒక ప్రత్యేకమైన పాత్ర అనుకుంటే అర్థంచేసుకోవడం సులువవుతుంది. కథేమిటంటే...అది 1981వ సంవత్సరం. గోతమ్ అనే కల్పిత నగరం. ఆ కుర్రాడిని ఎప్పుడూ సంతోషంగా ఉండమని చెబుతుంది వాళ్ళమ్మ. అతని పేరు ఆర్థర్ అయినా హ్యాపీ అని పిలుస్తుంటుంది. తల్లంటే చాలా ఇష్టాన్ని కలిగి ఉన్న ఆర్థర్, ఆమె చెప్పినట్టే ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న ప్రయత్నంలో భాగంగా స్టాండ్ అప్ కమెడియన్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. 'హాహా' అనే, నవ్వుల్ని పంచడమే వృత్తిగా గల వ్యాపార సంస్థలో జోకర్ గా పనిచేస్తుంటాడు. కానీ, ఎందువల్లో ఈ సమాజం అతడిని చిన్నచూపు చూస్తుంది. దారుణంగా అవమానిస్తూ, శారీరకంగానూ...

'ఎలీ' ఏమైంది? - Review of Iranian Movie 'About Elly'

Image
చాలా మందికి చిన్న చిన్న విషయాలకి కూడా అబద్ధమాడే అలవాటుంటుంది. అలా చెయ్యడం వలన, వాళ్ళకి ప్రత్యేకంగా కలిగే గొప్ప లాభమంటూ ఏమీ ఉండదు. కానీ ఏ చిన్నపాటి ఘర్షణ నుండో తప్పించుకోవడానికో, లేదా తామనుకున్న పని జరిపించుకోవడానికో అలా అబద్ధాలు చెప్పేస్తుంటారు. ఒక్కోసారి సరదాకి కూడా కొందరు అబద్ధాలాడుతుంటారు. ఆ అలవాటు ఎంతటి ప్రమాదకరమైనదో చూపిస్తుందీ సినిమా. ఇంకా, ఈనాటి ఇరానియన్ పౌరుల జీవన శైలీ, అక్కడి పరిస్థితుల్లో కలుగుతున్న మార్పులూ, వారి మహిళల్లో కలుగుతున్న చైతన్యం, ఇప్పటికీ రాజ్యమేలుతున్న పురుషాధిక్యతా లాంటి ఎన్నో విషయాలను అంతర్లీనంగా చర్చిస్తూ, పొరలు పొరలుగా విచ్చుకుంటూ, ఈ సినిమా కథ పరిచే సస్పెన్సయితే అంతా ఇంతా కాదు. ఇది 2009లో, పర్షియన్ భాషలో విడుదలైన ఇరానియన్ సినిమా 'ఎబౌట్ ఎలీ'.   ఈ సినిమా కథంతా ఎలీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంటుంది. అందుకే సినిమా పేరు ఎబౌట్ ఎలీ. కొన్ని స్నేహితుల కుటుంబాలు (మూడు జంటలూ, వారి పిల్లలూ, ఇంకా అహ్మద్ అనే మరో స్నేహితుడూ) కలిసి చేస్తున్న మూడు రోజుల సరదా విహార యాత్రగా సినిమా మొదలవుతు...

ఓ మంచి సినిమా... సోనార్ పహార్

Image
సోనార్ పహార్... ఈ బెంగాలీ సినిమా చూస్తున్నంత సేపూ నా కళ్లు చెమరుస్తూనే ఉన్నాయి. చివర్లో అయితే గొంతు పట్టేసి, బాగా నొప్పొచ్చి మరీ ఏడుపొచ్చింది. ఆ ఏడుపులో ఏడుపు, 'తెలుగులో ఇలాంటి సినిమాలెందుకు రావా!' అని మరికాస్త ఏడుపొచ్చింది (Just Kidding :) ). భారతీయ సినిమాకు ఆయువుపట్టులాంటిది ఎమోషన్. సినిమా ఎంత చెత్తగా, లాజిక్ లెస్ గా ఉన్నా, అందులో రెండు మూడు బలమైన ఎమోషనల్ సీన్లున్నప్పుడు, మనం దాన్నంత తేలిగ్గా తీసి పడెయ్యలేం. చూడటం ద్వారా కలిగే ఇటువంటి ఎమోషన్, జాలి నుండి పుడుతుంది. ఎదుటివారి నిస్సహాయతనూ, దుఃఖాన్నీ చూసినప్పుడు, మనిషన్నవాడెవడికైనా జాలి కలుగుతుంది. అందుకే, పెళ్లిలోపెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్లేందుకు బాధపడుతుంటే, పరిచయం లేని వారే కాదు, చివరికి అత్తగార్లు కూడా ఏడుస్తుంటారు. మగవారైనా అంతే; ఎదుటివారు పొగిలి పొగిలి రోదిస్తుంటే, కటికరాళ్లలా పడుండేవాళ్ళు తక్కువమందే ఉంటారు. నిజానికి ఈ సినిమా కథాంశానికి చెందిన కథతో ఇంతకుముందు చాలా సినిమాలే వచ్చాయి. కానీ సినిమా అంటే కేవలం కథ చెప్ప...

"Halkaa" Hindi Movie Review

Image
మనసును తేలిక చేసే 'హల్కా' నగరాలు విస్తరించుకుంటూ పోవడం వలన, పల్లెటూళ్ల నుండి అక్కడికి వలస పోయి, పొట్ట పోసుకుంటున్నవారికి చెందిన తరవాతి రెండూ, మూడూ తరాల వాళ్ళనే మనమిప్పుడు చూస్తున్నాం. ఈ తరాల యువకులకూ, పిల్లలకూ పల్లెటూళ్లనేవి కేవలం కథల్లో, ఊహల్లో విషయాలే తప్ప నిజంగా కళ్లతో చూసినవి కాదు. వాళ్లు పుట్టేదీ, పెరిగేదీ మొత్తం నగరాల్లోనే. అలా నగరాల చివరి బస్తీల్లో, మురికి వాడల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న అభాగ్యుల మీద ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కానీ అటువంటి వాతావరణంలోంచి అందాన్నీ, ఆశావహ దృక్పథాన్నీ అతి చక్కగా బయటకి తీసి చూపిన సినిమా మాత్రం ఈ 'హల్కా' నే. ఈ హిందీ సినిమా ఇటీవలే 2018 సెప్టెంబర్ లో విడుదలైంది. ఎంత సేపూ డబ్బులేని కష్టాలూ, ఇరుకిళ్ళలో పడే బాధలూ, తాగి చితక్కొట్టే తండ్రులూ, సంపాదనంతా లాక్కునే దళారులూ, తిండి లేక మాడే డొక్కలూ, రోగాల బారిన పడి అల్లాడిపోయే దేహాలూ... ఇవేనా? అక్కడా కొన్ని కొన్ని మంచి క్షణాలుంటాయి జీవించడానికి. అప్పుడప్పుడూ అవి స్వచ్ఛమైన పూవుల్లా విరబూసి నవ్వుతుంటాయి. అటువంటి కొన్ని క్షణాల్ని ఒడి...