Posts

Showing posts from March, 2019

'ఎలీ' ఏమైంది? - Review of Iranian Movie 'About Elly'

Image
చాలా మందికి చిన్న చిన్న విషయాలకి కూడా అబద్ధమాడే అలవాటుంటుంది. అలా చెయ్యడం వలన, వాళ్ళకి ప్రత్యేకంగా కలిగే గొప్ప లాభమంటూ ఏమీ ఉండదు. కానీ ఏ చిన్నపాటి ఘర్షణ నుండో తప్పించుకోవడానికో, లేదా తామనుకున్న పని జరిపించుకోవడానికో అలా అబద్ధాలు చెప్పేస్తుంటారు. ఒక్కోసారి సరదాకి కూడా కొందరు అబద్ధాలాడుతుంటారు. ఆ అలవాటు ఎంతటి ప్రమాదకరమైనదో చూపిస్తుందీ సినిమా. ఇంకా, ఈనాటి ఇరానియన్ పౌరుల జీవన శైలీ, అక్కడి పరిస్థితుల్లో కలుగుతున్న మార్పులూ, వారి మహిళల్లో కలుగుతున్న చైతన్యం, ఇప్పటికీ రాజ్యమేలుతున్న పురుషాధిక్యతా లాంటి ఎన్నో విషయాలను అంతర్లీనంగా చర్చిస్తూ, పొరలు పొరలుగా విచ్చుకుంటూ, ఈ సినిమా కథ పరిచే సస్పెన్సయితే అంతా ఇంతా కాదు. ఇది 2009లో, పర్షియన్ భాషలో విడుదలైన ఇరానియన్ సినిమా 'ఎబౌట్ ఎలీ'.   ఈ సినిమా కథంతా ఎలీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంటుంది. అందుకే సినిమా పేరు ఎబౌట్ ఎలీ. కొన్ని స్నేహితుల కుటుంబాలు (మూడు జంటలూ, వారి పిల్లలూ, ఇంకా అహ్మద్ అనే మరో స్నేహితుడూ) కలిసి చేస్తున్న మూడు రోజుల సరదా విహార యాత్రగా సినిమా మొదలవుతుంది. వేరే లోకంలో ఉన్నట్టున్న ఆ కుటుంబాలతో కలిసి, వారి మాటలని కాస్త శ్రద

ఓ మంచి సినిమా... సోనార్ పహార్

Image
సోనార్ పహార్... ఈ బెంగాలీ సినిమా చూస్తున్నంత సేపూ నా కళ్లు చెమరుస్తూనే ఉన్నాయి. చివర్లో అయితే గొంతు పట్టేసి, బాగా నొప్పొచ్చి మరీ ఏడుపొచ్చింది. ఆ ఏడుపులో ఏడుపు, 'తెలుగులో ఇలాంటి సినిమాలెందుకు రావా!' అని మరికాస్త ఏడుపొచ్చింది (Just Kidding :) ). భారతీయ సినిమాకు ఆయువుపట్టులాంటిది ఎమోషన్. సినిమా ఎంత చెత్తగా, లాజిక్ లెస్ గా ఉన్నా, అందులో రెండు మూడు బలమైన ఎమోషనల్ సీన్లున్నప్పుడు, మనం దాన్నంత తేలిగ్గా తీసి పడెయ్యలేం. చూడటం ద్వారా కలిగే ఇటువంటి ఎమోషన్, జాలి నుండి పుడుతుంది. ఎదుటివారి నిస్సహాయతనూ, దుఃఖాన్నీ చూసినప్పుడు, మనిషన్నవాడెవడికైనా జాలి కలుగుతుంది. అందుకే, పెళ్లిలోపెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్లేందుకు బాధపడుతుంటే, పరిచయం లేని వారే కాదు, చివరికి అత్తగార్లు కూడా ఏడుస్తుంటారు. మగవారైనా అంతే; ఎదుటివారు పొగిలి పొగిలి రోదిస్తుంటే, కటికరాళ్లలా పడుండేవాళ్ళు తక్కువమందే ఉంటారు. నిజానికి ఈ సినిమా కథాంశానికి చెందిన కథతో ఇంతకుముందు చాలా సినిమాలే వచ్చాయి. కానీ సినిమా అంటే కేవలం కథ చెప్పడం మాత్రమే కాదుగా. శిల్పం సౌందర్యభరితమయ్యేది చెక్కిన చేతుల వల్లనే కదా! (అఫ్కోర్స్ ! కథ చెప్పడానికి కూ