Posts

Showing posts with the label Book Reviews

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం

Image
  నబొకొవ్ తన జీనియస్నీ, విస్తృతమైన వకాబులరీ నీ, చిక్కులు పడ్డ వాక్యాల్లో చుట్టబెట్టి అందిస్తే, జార్జ్ లూయీస్ బోర్హెస్ మాత్రం తన మేథో సంపత్తిని మిస్టిక్ గా, మ్యాజికల్ గా అక్షరీకరించాడు. ఈయన రచనలు చదవాలనుకున్నప్పుడు, ఫిక్సియోనిక్స్ కంటే లాబిరింత్స్ వైపుకే ఎక్కువగా మొగ్గు చూపాను. రెండింటిలోనూ నాకు నచ్చే మ్యాజిక్ రియలిజం ఎలానూ ఉంటుంది; అది ఇంకాస్త ఎక్కువ ఫిక్షనల్ గా ఉంటే, మరింత ఉత్సాహంగా చదవవచ్చన్నది నా ఆలోచన. కానీ ఈయన రచనల్లో అనేక తరహాలకు చెందిన సింబాలిక్ మీనింగ్స్ ఉంటాయని చదివే కొద్దీ అర్థమవుతోంది.  గొప్ప రచయితల జీవితాలెందుకు వారి రచనల కంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయో తెలీదు. అలా ఆసక్తి కలిగించే విషయాలు బోర్హెస్ జీవితంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈయన రచనల్లో స్త్రీ పాత్రలు కనిపించవు. రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు గానీ అవి కేవలం కొన్ని (సాధారణం కాని) అవసరాలకు చెందిన ఒప్పందాలు మాత్రమే. మధ్య వయసులో అతను చూపును కోల్పోవడంతో, అప్పటివరకూ అతన్ని సంరక్షించి, లేదా కంట్రోల్ చేసిన అతని తల్లి, పెళ్...

అంతుపట్టని రచయిత - జూలియో కొర్తసార్

Image
  జూలియో కొర్తసార్ కథల్లోని సందిగ్ధతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అవివేకమే. అలాగని అవి అర్థం కాకుండా, అసంపూర్ణంగా కూడా ఉండవు. కథ పూర్తవుతుంది. అర్థమవుతుంది. ఒక మంచి కథను చదివిన అనుభూతినీ కలిగిస్తుంది. కానీ ఒక విచిత్రమైన చిక్కుముడిలాంటి సందిగ్ధత, ఆలోచనను అంత త్వరగా వదిలిపెట్టదు. ఆ ముడిని విప్పడం కుదరదని తెలిసినా, ప్రతీ విషయాన్నీ తరచి తరచి తర్కించడానికీ, ఒక క్రమ పద్ధతిలో ప్రవర్తించడానికీ అలవా టు పడిన మన మెదడు, ఆ కథ మీద చాలా సేపటివరకూ పని చేస్తూనే ఉంటుంది. అందులోని అసలు మర్మమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి ఆ కథకు ఒక లాజిక్ ను ఆపాదించి గానీ స్థిమితపడదు. కొర్తసార్ కథలన్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి. ఒక విచిత్రమైన ఆంబిగ్యుయుటీతో నిండి ఉండి, పూర్తిగా చెప్పకుండానే అంతా చెప్పేసినట్టుంటాయి. ఎంత గింజుకున్నా సగటు మనిషి ఊహలు చేరలేని సర్రియలిస్టిక్ స్పేస్ లో,  పారడాక్స్ ల పజిల్స్ గుండా ప్రయాణిస్తుంటాయి.  ఉదాహరణకు 'Axolotl' అనే కథలో, కథకుడు ఒక అక్వేరియంకి వెళ్ళినప్పుడు, అక్కడ యాక...