Posts

Showing posts from February, 2019

"Halkaa" Hindi Movie Review

Image
మనసును తేలిక చేసే 'హల్కా' నగరాలు విస్తరించుకుంటూ పోవడం వలన, పల్లెటూళ్ల నుండి అక్కడికి వలస పోయి, పొట్ట పోసుకుంటున్నవారికి చెందిన తరవాతి రెండూ, మూడూ తరాల వాళ్ళనే మనమిప్పుడు చూస్తున్నాం. ఈ తరాల యువకులకూ, పిల్లలకూ పల్లెటూళ్లనేవి కేవలం కథల్లో, ఊహల్లో విషయాలే తప్ప నిజంగా కళ్లతో చూసినవి కాదు. వాళ్లు పుట్టేదీ, పెరిగేదీ మొత్తం నగరాల్లోనే. అలా నగరాల చివరి బస్తీల్లో, మురికి వాడల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న అభాగ్యుల మీద ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కానీ అటువంటి వాతావరణంలోంచి అందాన్నీ, ఆశావహ దృక్పథాన్నీ అతి చక్కగా బయటకి తీసి చూపిన సినిమా మాత్రం ఈ 'హల్కా' నే. ఈ హిందీ సినిమా ఇటీవలే 2018 సెప్టెంబర్ లో విడుదలైంది. ఎంత సేపూ డబ్బులేని కష్టాలూ, ఇరుకిళ్ళలో పడే బాధలూ, తాగి చితక్కొట్టే తండ్రులూ, సంపాదనంతా లాక్కునే దళారులూ, తిండి లేక మాడే డొక్కలూ, రోగాల బారిన పడి అల్లాడిపోయే దేహాలూ... ఇవేనా? అక్కడా కొన్ని కొన్ని మంచి క్షణాలుంటాయి జీవించడానికి. అప్పుడప్పుడూ అవి స్వచ్ఛమైన పూవుల్లా విరబూసి నవ్వుతుంటాయి. అటువంటి కొన్ని క్షణాల్ని ఒడిసి పట్టగలిగితే, తీసుకొచ్చి ఇలా తెర మీద చూపగలిగిత

అంతుపట్టని రచయిత - జూలియో కొర్తసార్

Image
  జూలియో కొర్తసార్ కథల్లోని సందిగ్ధతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అవివేకమే. అలాగని అవి అర్థం కాకుండా, అసంపూర్ణంగా కూడా ఉండవు. కథ పూర్తవుతుంది. అర్థమవుతుంది. ఒక మంచి కథను చదివిన అనుభూతినీ కలిగిస్తుంది. కానీ ఒక విచిత్రమైన చిక్కుముడిలాంటి సందిగ్ధత, ఆలోచనను అంత త్వరగా వదిలిపెట్టదు. ఆ ముడిని విప్పడం కుదరదని తెలిసినా, ప్రతీ విషయాన్నీ తరచి తరచి తర్కించడానికీ, ఒక క్రమ పద్ధతిలో ప్రవర్తించడానికీ అలవా టు పడిన మన మెదడు, ఆ కథ మీద చాలా సేపటివరకూ పని చేస్తూనే ఉంటుంది. అందులోని అసలు మర్మమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి ఆ కథకు ఒక లాజిక్ ను ఆపాదించి గానీ స్థిమితపడదు. కొర్తసార్ కథలన్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి. ఒక విచిత్రమైన ఆంబిగ్యుయుటీతో నిండి ఉండి, పూర్తిగా చెప్పకుండానే అంతా చెప్పేసినట్టుంటాయి. ఎంత గింజుకున్నా సగటు మనిషి ఊహలు చేరలేని సర్రియలిస్టిక్ స్పేస్ లో,  పారడాక్స్ ల పజిల్స్ గుండా ప్రయాణిస్తుంటాయి.  ఉదాహరణకు 'Axolotl' అనే కథలో, కథకుడు ఒక అక్వేరియంకి వెళ్ళినప్పుడు, అక్కడ యాక్సొలోటొల్ అనే సముద్ర జీవులను చూసి, వాటి ఆకర్షణలో పడతాడు. అది మొదలు, రోజూ అక్కడికి వచ్చ