//అనుకోకుండానే...//
//అనుకోకుండానే...// *ఎక్కడికి పోయారు పిల్లకాయలంతా? **అయిందా స్నానం? టెర్రస్ మీదకెళ్లారు... ఆడుకోవడానికి. *వర్షం పూర్తిగా తగ్గిందో లేదో... **తగ్గిందిలే. మా వాళ్లు కొత్తగా స్కేటింగ్ నేర్చుకుంటున్నారుగా. నీ పుత్ర రత్నాలకి చూపిస్తామని ఒకటే గోల! *ఏంటి! వర్షిణికి కూడా నేర్పిస్తున్నారా!... **అవును. నాకిద్దరూ ఒక్కటే. *చూడ్డానికి అలా ఉంటుంది గానీ, పిల్ల బుద్ధిమంతురాలే లే. **నవ్వినప్పుడు ఎంత కళగా ఉంటుందో! నువ్వు సరిగా చూసినట్టు లేదు. *అవున్లే... ఇంతకీ ఆ అనాథాశ్రమం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయా? **తీసుకొచ్చి ఆర్నెల్లవుతోంది కదా. ఇంకేముంటాయి! *ఎందుకంత సడెన్గా అటువంటి నిర్ణయం తీసుకున్నారక్కా! పోనీ అబ్బాయినైనా తెచ్చుకోవాల్సింది. **చూడగానే వర్షిణి నాకోసమే అక్కడున్నట్టినిపించింది. *ఐడియా నీదే అనుకుంటాగా... **అవును. నాకు పెళ్ళికి ముందరి నుండీ కోరిక, అలా ఎవరికైనా కొత్త జీవితాన్నివ్వాలని. మీ బావగారు ఓ పట్టాన ఒప్పుకుంటేగా. అందుకే ఇంత లేటయింది. *చిన్న పాపైనా బావుండేది. మరీ పదేళ్లంటే...అన్నీ తెలిసిపోయే ఏజ్ కదా? **ఇద్దరూ ఒక వయసు వాళ్ళైతే బావుంటుందని. *అయినా నువ్వు గ్రేటక్కా! అలా చూసుకోవడం అంత ఈజీ కాదు...