మో


ఏ రోడ్ల మీద తిరిగాడో
ఏ అరుగుల మీద కూర్చున్నాడో
ఏ పరాయి పుర వీధుల్లో పచార్లు చేసాడో
ఏ రైలు కిటికీలోకి నదిలా దూకి ప్రవహించాడో
ఏ థియేటర్ సీటుకి వెన్నునొక్కిపెట్టి,
తలల మీది పళ్లన్నీ చూపుల్తో గురిపెట్టి కొట్టాడో
ఎన్నెన్ని నిగ్రహాల విగ్రహాల్ని
ఏ లైబ్రరీ మూలల్లో ప్రతిష్ఠించి పూజించాడో
ఏ బార్లో బాటిల్నో సాంబార్లో ఇడ్లీనో
కుమ్మి కుమ్మి కవితలు చేసాడో
ఎందరందగత్తెల వన్నెచిన్నెల్నో - వింజామరల్నో
విశ్వమంతా విసిరి - విసిరి సేద తీరాడో
ఎందరెందరు కవుల సమాధుల్ని తవ్వి తీసి
ఎన్నెన్ని గుండెల వేళ్ళలోకి గుచ్చి గుచ్చి బ్రతికించాడో
ఏ అక్షరాల తొక్కుడు బిళ్లల్ని విసిరి
ఎన్ని దుమ్ము పొరల మెదళ్ళు దులిపి రేగ్గొట్టాడో
ఎన్నిసార్లు సూరుడ్ని పొడిపొడిలా చితక్కొట్టి,
ఏ మధ్యాహ్నం పూట - టీ పెట్టుకు తాగాడో
ఎన్ని పొద్దున్నలు - చందమామను తరిమి తెచ్చి,
ఏ కాఫీ కప్పుపైన వెన్నెల స్మైలీలు నొక్కి పిండాడో...
ఏ వీధినీ ఉదయాన్నీ చూసినా
ఏ కలనీ కన్నీటినీ మోసినా
ఎక్కడో ఏ'మో'నని వెతుకులాటగానే ఉంది
.

Comments

  1. Replies
    1. ఎప్పటినించో తెలుసు గానీ ఈ మధ్య ఈ పుస్తకం చదివి రోడ్డు మీదకి వెళితే ఇటువంటి ఫీలింగ్ బలంగా వచ్చింది. మీక్కూడా ఇష్టం కదా.

      Delete

Post a Comment

Popular posts from this blog

//అనుకోకుండానే...//

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం