జన్మ

అది విశ్వం
చూపునావరించేది సూర్యుడూ, చంద్రుడే
మళ్ళీ అందులో మరిన్ని విశ్వాలు
అందందులో మరెందరో సూర్యచంద్రులూ
సన్నని దారాలేవీ కనిపించవు
ఒకదాన్నొకటి వదిలీపెట్టవు
చీకటి పరుపుల సంద్రాలలోన
నిండు చీకట్ల శూన్యాలపైన
తిరుగుతూ తిరుగుతూ
వేగంగా కదులుతూ
అంతలోనే నిదురిస్తూ
అంబిలికల్ కార్డుకు చుట్టుకుని,
వస్తాడు శిశువు
ఒక గర్భంలోంచి మరో గర్భంలోకి
తల్లి కడుపులోంచి
ఇలా అనంతానంత విశ్వంలోకి
(Congratulations Satti Babu and Divya)

Comments

  1. ఒక గర్భంలోంచి మరో గర్భంలోకి -->WoW! ఈ లైన్ అద్భుతమండీ...! ఒక్కసారిగా జాషువా గుర్తొచ్చాడు!

    ReplyDelete
    Replies
    1. ఏదో లెండి. మీరలానే అంటారు :)

      Delete
    2. Hello Hello...check check...elaa unnarandi..just came to update my blog and thought about you...How are you! where are you...hope everything is fine at your end..<3

      Delete
  2. Find the best games for iOS, Android & iOS - DrMCD
    The 오산 출장샵 Best Casino 광주 출장안마 Apps · Microgaming Casino 여주 출장안마 · Bovada Casino · Golden Nugget · BetMGM Casino · BetMGM 통영 출장샵 Casino · Caesars Casino · Super 군산 출장안마 Slots Casino

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మో

//అనుకోకుండానే...//

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం