ఫిజిక్సాలసఫీ పోయెమ్స్ - 2



సెల్సియస్ లలోని నీ సహనం,
మరొకరి స్కేల్ మీద ఫారెన్ హీటు.
కో'యెఫిషియంట్ల' కొలతల్లో కాస్త ముందుకో వెనక్కో,
అంకెల సూత్రాలను చంకనేసుకుని మాత్రం, చుట్టూ సమాజం
లోచన లోతూ, యోచన వైశాల్యమూ ఎవరిదెవరికి!
రెండు రెట్ల బీటాగా, మూడు రెట్ల గామాగా - ఒక్కటే ఆల్ఫా
మరిగి చల్లబడటాలు మనిషి గుణాలూను;
మనసు థెర్మామీటర్లో నువ్వు మంచినీటివైనా, పాదరసానివైనా!

Comments

Popular posts from this blog

జన్మ

Joker (2019) Movie Review