ఫిజిక్సాలసఫీ పోయెమ్స్ - 1

ఏ యాంగిలైతే మునుగుతుందో కాపిలరీ ట్యూబ్!
ఆత్మ - శూన్యంలోకి బుడుంగుమన్న చప్పుడు
బయటకు లాగే బలమేదీ సరిపోదు,
వ్యతిరేకంగా వొంటి భారమే దిగదీస్తుంటే.
జీవపు సాంద్రత గల సరికొత్త ద్రవంలో,
విస్కాసిటీ చురకత్తుల - అంతులేని అంతర్యుద్ధం
పోయిజెయీలూ, స్టోక్లూ ఎన్ని తత్వాలైనా పాడనీ;
దేహపు పాత్ర పగిలిపోతేనే ఇక, ప్రాణానికి ముక్తీ , విముక్తీ!

Comments

Popular posts from this blog

మో

//అనుకోకుండానే...//

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం